2022-23 బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం..

71
- Advertisement -

మగళవారం 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. అంతకుముందు పార్లమెంటుకు చేరుకున్న ఆమె. ఆర్థిక శాఖ సహాయ మంత్రులు, అధికారులతో కలిసి పార్లమెంటు భవనం ముందు ఆమె ఫోటోలు దిగారు. సంప్రదాయబద్ధంగా జాతీయ చిహ్నం ఉన్న ఎర్రటి సంచిలో ఆమె బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చారు. మరోవైపు ఈ సారి కూడా సభలో ఆమె పేపర్ లెస్ బడ్డెట్ ను ప్రవేశపెడుతున్నారు. అంటే… పేపర్ ఆధారంగా కాకుండా డిజిటల్ ఆధారంగా ఆమె బడ్జెట్ ను చదవనున్నారు.

మరోవైపు కోవిడ్ నేపథ్యంలో ఈ సారి ‘హల్వా’ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు ఆర్థికమంత్రి, ఆర్థికశాఖ అధికారులు హల్వా కార్యక్రమాన్ని నిర్వహించడం ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయమనేది తెలిసిన విషయమే. ఇక ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రారంభమైంది. కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతుండటం ఇది నాలుగో సారి.

- Advertisement -