మొత్తం బడ్జెట్ బడ్జెట్ … 21.47లక్షల కోట్లు
రైల్వే బడ్జెట్ రూ.1.31లక్షల కోట్లు
* రైల్వేకు రూ.55వేల కోట్ల ప్రభుత్వ సాయం
* 2020 నాటికి బ్రాడ్‌గేజ్ మార్గాల్లో గేట్లు ఏర్పాటు
* ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకునే రైలు టికెట్లపై సేవాపన్ను రద్దు
* 2017-18లో 25 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ
* దేశీయ అవసరాలకు అనుగుణంగా కొత్త మెట్రో రైలు విధానం
*అమరావతి రైతులకు శుభవార్త, క్యాపిటల్ గెయిన్స్ రద్దు
*రాజధాని ప్రాంతంలో భూములు విక్రయించినవారికి పన్ను మినహాయింపు
*రాష్ట్రం ఏర్పాటు అయిన 2014 నుంచి క్యాపిటల్ గెయిన్స్ రద్దు
*ల్యాండ్ పూలింగ్‌లో ఉన్నవారికి మాత్రమే క్యాపిటల్ గెయిన్స్ పన్ను రద్దు
* జనరిక్ ఔషధాల వినియోగానికి ప్రత్యేక విధానం
* వైద్య పరికరాలు, ఉత్పత్తికి ప్రత్యేక విధానం
* 2025లోగా క్షయ వ్యాధి నిర్మూలనకు చర్యలు
* వెనుకబడిన కులాలకు రూ.52,393 కోట్లు కేటాయింపు
* గిరిజనులకు రూ.31,920
* మైనారిటీలకు రూ.4,195 కోట్లు
* వృద్ధులకు 8శాతం వడ్డీతో ఎల్‌ఐసీ ద్వారా ప్రత్యేక బాండ్లు
* మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి రూ.48వేల కోట్ల కేటాయింపు.
* 2018కల్లా గ్రామీణ విద్యుద్దీకరణ పూర్తి. దీంతో అన్ని గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం.
* ఫ్లొరైడ్ బాధిత గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా.
* గ్రామాల్లో అభివృద్ధి 42 నుంచి 60శాతానికి పెరిగింది.
* 2018కల్లా గ్రామీణ విద్యుద్దీకరణ పూర్తి. దీంతో అన్ని గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం.
* ప్రధాన మంత్రి పజల్ యోజన కింద రోడ్లు, 133 కి.మీ. ప్రతి రోజూ నిర్మించనున్నాం.
* ఉపాధిహామీ పథకంలో మహిళలకు ప్రాతినిథ్యం పెంపు
* కృషి విజ్ఞాన కేంద్రంలో భూసార కేంద్రాలు
* 100 రోజుల కనీస ఉపాధిహామీ.
* స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
* సంకల్ప్ పథకం ద్వారా యువతకు ప్రత్యేక శిక్షణ.
* ఐసీటీ ద్వారా విద్యాబోధన. అన్ని ప్రవేశ పరీక్షలకు ఒకే సంస్థ
* ప్రతిభ కలిగిన కళాశాలల్లో ప్రత్యేక ప్రోత్సాహకాలు.
* సెకండరీ విద్యలో ఆవిష్కరణలకు ప్రత్యేకనిధి.
* ఉపాధి అవకాశం ఎక్కువగా ఉన్న కోర్సుల ఏర్పాటు.
* దేశం వెలుపల కూడా ఉపాధి పొందేందుకు వీలుగా శిక్షణ.
* దేశవ్యాప్తంగా 100 నైపుణ్య కేంద్రాలు.
విద్యారంగం కోసం ప్రత్యేక డీటీహెచ్ ఛానల్ ఏర్పాటు
* 600 జిల్లాల్లో ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు
* రూ.4వేల కోట్లతో నైపుణ్యాభివృద్ధికి సంకల్ప నిధి
* నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో ఐటీఐల అనుసంధానం
* ఐదు ప్రత్యేక పర్యాటక జోన్ల అభివృద్ధి
* మహిళా సాధికారత కోసం రూ.500కోట్ల మహిళా శక్తి కేంద్రాలు
* గర్భిణుల ఆస్పత్రి ఖర్చులకు రూ.వేల నగదు బదిలీ
* గృహ నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా
* గృహ రుణాలిచ్చే బ్యాంకులకు జాతీయ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రూ.20వేల కోట్ల రుణం
* నోట్ల రద్దు ద్వారా వచ్చిన నగదు నిల్వలతో ఇప్పటికే బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గిస్తున్నాయి. పరిమిత స్థాయిలో గృహ రుణాలపై వడ్డీ తగ్గింపు ప్రధాని ఇప్పటికే ప్రకటించారు.
* 2019 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని అరికడతాం.
* ఉపాధి హామీ పథకానికి రూ. 48 వేల కోట్లు కేటాయింపు. గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర ఉపాధి హామీ కోసం చర్యలు తీసుకుంటాం. వ్యవసాయం కోసం ఉపాధి హామీ పథకం నిధులు వినియోగిస్తాం.
* వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1,87,23 కోట్లు ఖర్చుచేస్తాం.
* ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు రూ.19,100కోట్లు
* ప్రధాని ఆవాస్ యోజనకు రూ.23వేల కోట్లు
* గ్రామజ్యోతి యోజనకు రూ.4,300కోట్లు
* అంత్యోదయ యోజనకు రూ.2,500కోట్లు
* నిరుపేదలకు కోటి ఇళ్ల నిర్మాణం
* ఫ్లోరైడ్ పీడిత 28వేల గ్రామాలకు ప్రత్యేక తాగునీటి పథకాలు
* అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటిగా ఐఎంఎఫ్ పేర్కొంది.
* విదేశీ పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయి. 361 బిలియన్ డాలర్లు విదేశీ మారక ద్రవ్య నిల్వలు చేరాయి.
* రైతులకు అండగా ఫసల్ బీమా యోజనను 30శాతం నుంచి 40శాతానికి పెంచుతున్నాం.
* పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు. పాల కేంద్రాలను పాలవెల్లువ పథకం కింద రూ.8వేల కోట్లతో పాలసేకరణ కేంద్రాల స్థాపన.
* గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టడంతో పాటు మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం.
* గత రెండు సంవత్సరాలుగా ఆర్థిక సంస్కరణలు వేగవంతంగా ఉన్నాయి. ఇందులో జీఎస్‌టీ ఒకటి.
* ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో ఉంది. అయినా భారత్ అన్నిరంగాల్లో ప్రగతి సాధించింది.
* వ్యవసాయ రుణాలకు రూ. 10లక్షల కోట్లు కేటాయింపు
* ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌లో వ్యవసాయ రంగానికి 60 రోజుల వడ్డీ మినహాయింపు
* నాబార్డుతో సహకార బ్యాంకులు, వ్యవసాయ సంఘాలను అనుసంధానిస్తాం
* ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలోనూ భూసార పరీక్ష కేంద్రాల ఏర్పాటు
* సాగునీటి సౌకర్యం కోసం రూ.40వేల కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు
* ఈనామ్‌లు రూ.240 నుంచి రూ.500 పెంపు
* రైతులు, గ్రామీణ ఉపాధి, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
* నోట్ల రద్దు, జీఎస్‌టీ ద్వారా ఆర్థిక వ్యవస్థలో అతి గొప్ప మార్పునకు పునాది పడింది.
* ముడి చమురు ధరల్లో ఒడిదొడుకులు ఇబ్బంది పెట్టాయి.
* దేశ జీడీపీ 2017-18లో 7.6 శాతం, 2018-19లో 7.8 శాతంగా ఉంటుందని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది.
* మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన దిశగా బడ్జెట్ రూపొందించాం.
* ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి విదేశీ పెట్టుబడుల విధానాలు సరళీకరిస్తున్నాం.
* ఈ బడ్జెట్ ద్వారా మూడు సంస్కరణలు తీసుకొచ్చాం. బడ్జెట్‌ను ఫిబ్రవరికి మార్చాం. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపాం.
* ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయంలా కాకుండా రంగాల వారీగా బడ్జెట్ రూపొందించాం.
* రైతుల ఆదాయం ఐదేళ్లలో రెట్టింపు చేస్తాం.
* 2017లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కోలుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.
* ఈ ప్రభుత్వం సంపూర్ణ పారదర్శక విధానాలను అమలు చేస్తోంది.
* విదేశీ మారక ద్రవ్యనిల్వలు 361 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
* భారత్ ఉత్పాదక రంగంలో ప్రపంచంలో 9వ స్థానం నుంచి 6వ స్థానానికి ఎగబాకింది.
* ద్రవ్యోల్బణాన్ని రెండంకెల నుంచి కనిష్ఠస్థాయికి తగ్గించాం.
* నల్లధనం అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేశాం. నల్లధనంపై యుద్ధం ప్రకటించాం. అవినీతిని నిర్మూలిస్తాం.
రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో ఆంక్షలు
నగదులో కేవలం రూ.2వేలు వరకే రాజకీయ పార్టీలకు విరాళం ఇవ్వొచ్చు
చెక్ లేదా డిజిటల్ రూపంలో ఎంతైనా రాజకీయ విరాళం
ఆర్థిక వ్యవస్థ నుంచి బ్లాక్ మనీని తొలగిస్తాం
సహేతుకంగా పన్నుల వ్యవస్థ
నోట్ల రద్దు వల్ల వ్యక్తిగత ఆదాయ వివరాలు వెల్లడించారు
ఇన్‌కం ట్యాక్స్ చెల్లింపుల శాతం 34.85కు చేరింది
బ్లాక్ మనీ వెలికితీతకు సిట్ చేసిన సిఫార్సులను ఆమోదిస్తున్నాం
రూ.3 లక్షలకు మించితే నగదు చెల్లింపులు ఉండవు
* రక్షణ రంగానికి రూ.2.74లక్షల కోట్లు
* బీమ్ యాప్ ప్రోత్సాహం కోసం రెండు కొత్త పథకాలు
* సామాన్యుడికి ప్రయోజనం కలిగేలా నగదు రహిత చెల్లింపు వ్యవస్థ
* పెట్రోల్ బంకులు, ఆస్పత్రుల్లో నగదు రహిత చెల్లింపులకు ప్రోత్సాహం
* రూ.2500 కోట్ల నగదు రహిత లావాదేవీలు జరపాలన్నది లక్ష్యం.
* త్వరలో ఆధార్ అనుసంధానిత వ్యవస్థ
* ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి వెళ్లే నేరగాళ్ల ఆస్తుల జప్తు కోసం ప్రత్యేక చట్టం
* 2020లోగా 20లక్షల ఆధార్ ఆధారిత పీవోఎస్ యంత్రాలు
* భారత్ నెట్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యం కోసం రూ.10వేల కోట్లు
* మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.3,96,135 కోట్లు
* దేశవ్యాప్తంగా 250 ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పాదక కేంద్రాలు. వీటి కోసం రూ.1.26లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి.
* 20వేల మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు
* ప్రభుత్వ రంగ సంస్థలను స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేసేందుకు విలువ నిర్థరణ కమిటీ ఏర్పాటు
* ముద్రా రుణాల కోసం రూ.2.44లక్షల కోట్లు
* వృద్ధులకు ఆధార్ ఆధారిత ఆరోగ్య కార్డులు
* విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు రద్దు
* ఒడిశా, రాజస్థాన్‌లో ముడి చమురు నిల్వ కేంద్రాల ఏర్పాటు