పేపర్ లీక్‌లపై మోదీ సంచలనం

3
- Advertisement -

పేపర్ లీక్ కేసుల్లో ‘న్యాయం’ జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మన యువత భవిష్యత్తుకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోం అని ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేశారు.

పేపర్ లీక్ కేసులలో వేగవంతమైన, కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

Also Read:24న తెలంగాణ బంద్:నిరుద్యోగ జేఏసీ

మన యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే ప్రాధాన్యమైనది మరొకటి లేదు! పేపర్ లీక్‌లకు పాల్పడే వారికి త్వరితగతిన, తీవ్రమైన శిక్షలు ఖాయం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, వర్గాలకు ఆదేశాలు జారీ చేశాం. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు మేము తీసుకుంటున్న వరుస చర్యలలో ఇది మరొక భాగం. మన యువత భవిష్యత్తును దెబ్బతీయాలని చూసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోం అని స్పష్టం చేశారు.

- Advertisement -