- Advertisement -
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వ ఆదేశాల మేరకు దట్టమైన నల్లమలలో వెలసిన ఉమా మహేశ్వరం ఆలయాన్ని మూసివేశారు. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీశైలం ఉత్తర ద్వారం అయినటువంటి ఉమా మహేశ్వర దేవాలయాన్ని కరోనా నేపథ్యంలో మూసివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
నేటి నుండి మార్చి 31 వరకు ఆలయంలో భక్తులకు దర్శనం నిలిపి వేయడం జరుగుతుందన్నారు. కావున భక్తులు సహకరించి ఆలయం దర్శనం కోసం వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు. అయితే ఉమామహేశ్వర ఆలయంలో బ్రాహ్మణులు నిత్య పూజలు చేస్తారని తెలిపారు. భక్తులు ప్రతి ఒక్కరు గమనించి సహకరించాలని కోరారు.
- Advertisement -