రైతులను చైతన్యం చేయండి: నిరంజన్ రెడ్డి

291
niranjan reddy
- Advertisement -

రానున్న రోజులలో వ్యవసాయ రంగం మరింత విస్తరిస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో టాసా (ఆత్మ ) డైరీని ఆవిష్కరించారు నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వ్యవసాయంలో సాంకేతిక మెళకువలు అందించాలన్నారు.

విజ్ఞాన యాత్రలతో క్షేత్రస్థాయి విజయగాధలను రైతులకు పరిచయం చేయాలన్నారు. శిక్షణలతో రైతులను సుశిక్షుతులను చేయాలి.. సాగునీటి రాకతో తెలంగాణ వ్యవసాయ స్వరూపం మారిపోయిందన్నారు.

పెరిగిన సాగు నేపథ్యంలో కూలీల కొరత వ్యవసాయ రంగాన్ని వేధిస్తుందని..దీనిని అధిగమించేందుకు రైతులకు అవగాహన కల్పించి యాంత్రీకరణ వైపు మళ్లించాలన్నారు. ఆత్మ ఉద్యోగులు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలన్నారు. రైతులకు సేవ చేయడం అదృష్టంగా భావించాలన్నారు. టాసా అధ్యక్షులు భరత్ కుమార్, ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి, సభ్యులు సంజీవ్, సూర్యప్రకాష్, వినోద్, ప్రసన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -