- Advertisement -
కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 12 వ తేదీన సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆలయ అధికారులు, పండితుల సమక్షంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో ప్రభుత్వం తరపున అమ్మవారికి సమర్పించనున్న పట్టు వస్త్రాలను మహంకాళి ఆలయ EO మనోహర్ రెడ్డి, ఆలయ పండితులకు మంత్రి దంపతులు అందజేశారు.
- Advertisement -