ఇకపై సినిమాల్లో నటించను:స్టాలిన్

39
- Advertisement -

ఇకపై తాను సినిమాల్లో నటించనని తేల్చిచెప్పారు తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు,మంత్రి ఉదయనిధి స్టాలిన్. మామన్నన్ లాంటి మంచి సినిమా నా చివరి సినిమా కావడం సంతోషంగా ఉందన్నారు. కమల్ హాసన్ నిర్మాణంలో నేను ఓ సినిమా చేయాలి. కానీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక సినిమాల్లో నటించడం సరికాదని నా అభిప్రాయం అన్నారు.

అందుకే సినిమాలు ఆపేస్తున్నాను. ఒకవేళ మామన్నన్ దర్శకుడు మారి సెల్వరాజ్ కనుక మంచి కథతో మళ్ళీ వస్తే మూడేళ్ళ తర్వాత నటించడానికి ఆలోచిస్తాను అని అన్నారు.

Also Read:తెలంగాణతో పాటే.. ఏపీ ఎలక్షన్స్ ?

గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు ఉదయనిధి. ఎమ్మెల్యే అయిన తర్వాత పలు సినిమాలు చేశారు. కానీ ఇటీవలె యూత్ వెల్ఫేర్, క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రి అయిన తర్వాత సినిమాలేమి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read:Chiranjeevi:నాకు క్యాన్సర్ లేదు

- Advertisement -