తెలంగాణతో పాటే.. ఏపీ ఎలక్షన్స్ ?

43
- Advertisement -

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం ఉంది. అయినప్పటికి ఇప్పటి నుంచే ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఏపీలోనూ మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, విపక్ష జనసేన.. ఇలా మూడు పార్టీలు కూడా ఎన్నికలే టార్గెట్ గా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంచితే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అంటే.. అవుననే సమాధానం గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే ముందస్తు ఎన్నికలకు సూచనగా విశ్లేషకులు చెబుతున్నారు.

గత కొన్నాళ్లుగా ఏపీలో ముందస్తు ఎన్నికలపై తరచూ వార్తలు వినిపిస్తున్నప్పటికి.. జగన్ సర్కార్ మాత్రం వాటిని కొట్టిపారెస్తు వస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని జగన్ ప్రభుత్వం క్లారిటీ ఇస్తూ వస్తూనే ఉంది. అయితే జగన్ సైలెంట్ వ్యూహం అమలు చేసే అవకాశం ఉందని భావించిన టీడీపీ, జనసేన పార్టీలు ముందస్తు ఎన్నికలకు సిద్దమే అని చెప్పకనే చెబుతున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికి టీడీపీ అధినేత చంద్రబాబు అందరికంటే ముందే మేనిఫెస్టో ప్రకటించారు.

Also Read: బీజేపీకి ఆ భయం పట్టుకుందా ?

మరోవైపు పవన్ తన వారాహి ప్రచారాన్ని ఈ నెల 16 నుంచి ప్రారంభించబోతున్నారు. ఇద్దరు అధినేతలు ఇంతా దూకుడుగా వ్యవహరించడానికి కారణం ముందస్తు ఎన్నికలే అనేది కొందరి అభిప్రాయం. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఈ నెల 7 న వైఎస్ జగన్ కేబినెట్ బేటీకి పిలుపునిచ్చారు. ఈ బేటీలో ముందస్తు ఎన్నికలపై ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ లో అసెంబ్లీ రద్దు చేసి తెలంగాణతో పాటు డిసెంబర్ లో ఎన్నికలకు వెళ్ళే ప్లాన్ లో జగన్ ఉన్నారట. మరి జగన్ ప్లాన్ ఎలా ఉన్నప్పటికి.. టీడీపీ జనసేన పార్టీలు మాత్రం ముందస్తు ఎన్నికలకు సిద్దమైనట్లే కనిపిస్తున్నాయి.

Also Read: బీజేపీ ” ఇంటింటి ప్రచారం ” ప్రజాగ్రహం తప్పదా ?

- Advertisement -