Chiranjeevi:నాకు క్యాన్సర్ లేదు

45
- Advertisement -

తనకు క్యాన్సర్ ఉందని మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ వార్తలు పూర్తి అవాస్తవమని..తాను క్యాన్సర్‌ పట్ల అవగాహన కలిగి ఉండాలని , రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని నివారించవొచ్చని చెప్పాను. గతంలో నేను కొలనోస్కోపీ టెస్ట్‌ చేయించుకున్నాను. అందులో క్యాన్సర్‌ రహిత పాలిప్స్‌ని గుర్తించి తొలగించారు. ఒకవేళ ముందుగా పరీక్ష చేయించుకోకుండా ఉంటే అది క్యాన్సర్‌ కింద మారేదేమో అని చెప్పాను. అయితే కొన్ని మీడియా సంస్థలు నా మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా అవగాహనరాహిత్యంతో నేను క్యాన్సర్‌ బారిన పడ్డానని ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు.

చికిత్స వల్ల బతికానని వార్తలు ప్రసారం చేశారు. నా ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ నా శ్రేయోభిలాషులు, అభిమానులు సందేశాలు పంపిస్తున్నారు. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు, చవాకులు రాయకండి. దీనివల్ల అందరిని బాధపెట్టిన వారవుతారు అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Also Read:వారికి ” నో సీట్ ” అంటున్న బీజేపీ !

శనివారం హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడాలోని స్టార్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసి క్యాన్సర్‌ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరు.. తాను చేయించుకున్న ముందస్తు పరీక్షల వల్ల క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం నుంచి తప్పించుకున్నానని తెలిపారు. దీనిని కొన్ని మీడియా సంస్థలు తప్పుగా ప్రసారం చేయడంతో క్లారిటీ ఇచ్చారు చిరు.

- Advertisement -