టైప్ 2 డయాబెటిస్ చాలా ప్రమాదం..జాగ్రత్త!

32
- Advertisement -

నేటి రోజుల్లో డయాబెటిస్ చాప కింద నీరులా విస్తరిస్తూ ప్రపంచాన్ని కబలిస్తోంది. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా డయాబెటిస్ బారిన పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీనినే చక్కర వ్యాధి, మధుమేహం అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అన్నీవయసులవారిని ఈ డయాబెటిస్ వేదిస్తోంది. మనం తినే ఆహారంలో చక్కెర శాతం ఎక్కువగా ఉన్నప్పుడూ, దానిని కంట్రోల్ చేసే సామర్థ్యం శరీరానికి లేకపోతే అది క్రమేసి మధుమేహానికి దారి తీస్తుంది. ఇది వ్యాధి కాకపోయిన ఇదొక ఆరోగ్య సమస్య.. డయాబెటిస్ లో టైప్ 1, టైప్ 2 రెండు రకాలు ఉంటాయి. .

టైప్ 1 డయాబెటిస్ ను సరైన ఆహార నియమాలు, తగు జాగ్రత్తలు పాటించడం వల్ల నివారించే అవకాశం ఉంది. కానీ టైప్ 2 డయాబెటిస్ బారిన పడితే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉండని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 30 ఏళ్ళు పైబడిన వారిలో ఈ టైప్ 2 డయాబెటిస్ ఎక్కువగా కనిపిస్తోందని అధ్యయనలు చెబుతున్నాయి. టైప్ 2 డయాబెటిస్ ఏర్పడానికి కారణం జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చొని పని చేయడం, ఒత్తిడి వంటివి టైప్ 2 డయాబెటిస్ రావడానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.

ఈ టైప్ 2 మధుమేహం బారిన పడిన వారిలో దాహం, ఆకలి ఎక్కువగా ఉండడం, అతిగా మూత్ర విసర్జన చేయడం, నీరసం, అలసట, గాయాలు త్వరగా మానకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ కారణంగా క్లోమ గ్రంథి తగినంతా ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయడం ఆపేస్తుంది. తద్వారా మరిన్ని అనారోగ్య సమస్యలు దారి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి డయాబెటిస్ ను ఏ మాత్రం అశ్రద్ద చయరాదని నిపుణులు చెబుతున్నారు. తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడం, క్రమపద్దతి అయిన జీవన విధానం, శారీరకశ్రమ.. వంటివి పాటిస్తూ డయాబెటిస్ ను ఎదుర్కోవచ్చు.

Also Read:Congress:కాంగ్రెస్ కు 17 సీట్లు..అన్యాయమా?

- Advertisement -