పార్టీల పోరు.. పాదయాత్రల జోరు!

112
- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతూ ప్రజాకర్షణే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు రాజకీయ నాయకులు. అయితే ఏదైనా ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రత్యర్థి పార్టీల బలహీనతలపై దెబ్బకొట్టడంతో పాటు తమ పార్టీ బలం పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పార్టీలు ఇదే పంథాలో ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీ నేతలపై పదునైన విమర్శలు గుప్పిస్తూనే.. సొంత పార్టీ బలం పెంచుకునే పనిలో పడ్డారు నేతలంతా. అందుకోసం రాజకీయ నాయకులంతా ప్రధానంగా సిద్దం చేసుకుంటున్న అస్త్రం పాదయాత్ర. ఎన్నికల్లో సత్తా చాటలంటే ప్రజలతో మమేకం అవ్వడం చాలా కీలకం..

అందువల్లే అన్నీ ప్రధాన పార్టీలు పాదయాత్రలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఏపీలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని గట్టి పట్టుదలగా ఉంది. అందుకోసం నారా లోకేశ్ త్వరలో చేపట్టబోయే పాదయాత్రపైనే ఆశాలన్నీ పెట్టుకుంది. జనవరి 27 నుంచి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ యాత్ర ద్వారా పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని టీడీపీ శ్రేణులు గట్టిగా నమ్ముతున్నారు.

ఇక తెలంగాణలో అయితే బీజేపీ తరుపున బండి సంజయ్ ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరుపున వైఎస్ షర్మిల కూడా పాదయాత్ర చేపట్టింది. త్వరలో కాంగ్రెస్ తరుపున రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేపట్టనున్నారు. ఇక కేంద్రంలో వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి విధితమే. ఇలా ప్రతిపక్షంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ నేతలు కూడా అధికారం కోసం పాదయాత్రనే ప్రధాన అస్త్రంగా ముందుకు సౌగుతున్నారు. మరి నిజంగానే ఈ పాదయాత్రల వల్ల పార్టీల ఫెట్ మారుతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి…

రిచెస్ట్‌ సీఎమ్స్‌ ఇన్ ఇండియా…

టీడీపీతో పొత్తు.. పవన్ క్లారిటీ ఇస్తారా?

బండి పాదయాత్రకు బ్రేక్.. అంతా కన్ఫ్యూజన్ !

- Advertisement -