వేలల్లో తగ్గిన బంగారం ధర!

252
gold rate
- Advertisement -

రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసడి ధరకు బ్రేక్ పడింది.బంగారం ప్రేమికులకు శుభవార్తనందిస్తూ వందల్లో కాదు వేలల్లో తగ్గుముఖం పట్టింది.
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.2930 తగ్గి రూ.55,760కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,690 తగ్గి రూ.51,110కు పడిపోయింది.

బంగారం బాటలోనే వెండి కూడా భారీగా పతనమైంది. కిలో వెండి ధర రూ. 7250 తగ్గి రూ.66,950కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది. ఔన్స్‌ బంగారం ధర 1953 డాలర్లకు చేరగా వెండి ధర కూడా భారీగానే పడిపోయింది.

- Advertisement -