హ్యాకింగ్…ఈ పేరు వింటేనే వీఐపీలు వణికిపోతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు విఐపీలు,సినీ నటుల అకౌంట్‌ని హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ సీఈవోకే షాకిచ్చారు. ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ ఎకౌంట్‌ను హ్యాక్ చేశారు.
పదిహేను నిమిషాల పాటు డోర్సీ ఎకౌంట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు హ్యాకర్స్. డోర్సీ అకౌంట్లో అనుచిత వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. రెచ్చొగొట్టే మెసేజ్‌లు పెట్టారు. దీంతో హ్యాకింగ్‌ను వెంటనే పసిగట్టిన ఎక్స్పర్ట్స్ డోర్సీ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్ల నుంచి రక్షించారు.
మరోవైపు డోర్సీ ట్విటర్ ఎకౌంట్ ఎలా హ్యాక్ అయింది? అసలు భద్రతా లోపాలు ఎక్కడ ఉన్నాయి? అనే దానిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు ట్విటర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. మొబైల్ ప్రొవైడర్ భద్రతా లోపం కారణంగా అకౌంట్ తో లింక్ చేసిన ఫోన్ నంబర్ ను హ్యక్ చేసి ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది. దుండగులు ట్వీట్ చేసిన ట్విట్లలో జాత్యహంకార, దేశ విద్రోహపూరిత కామెంట్లు ఉండటంతో కొంతమంది నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.