నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో సంకీర్త‌నాగానం

7
- Advertisement -

తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు శుక్ర‌వారం సాయంత్రం శ్రీ పురందరదాసులవారి కీర్తనలతో మారుమోగాయి. శ్రీ పురందరదాసులవారి ఆరాధన మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ముందుగా శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా చల్లటి సాయంత్రం వేళ నిర్వ‌హించిన ఊంజ‌ల్‌సేవ‌లో దాస సంకీర్తనల గానం భక్తులను మైమరపింపచేసింది. ఈ కార్యక్రమంలో ఉడిపి పా‌లిమారు మ‌ఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విద్యాధీశ‌తీర్థ స్వామీజీ, ఉత్త‌రాధికారి శ్రీ‌శ్రీ‌శ్రీ విద్యారాజేశ్వ‌తీర్థ స్వామిజీ పాల్గొన్నారు.

టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు. ఇందులో ” వండితే గురుపు రందర దాసరే…., “బందాలో మహాలక్ష్మి…”, అడిదనో రంగ…, బంధ నేనే రంగా…, శ్రీనివాస నీనే బలిసో…, తిరుపతి వెంకటరమణ….™️ తదితర కీర్తనలు భక్తి సాగరంలో ముంచెత్తాయి.

Also Read:Pawan:పవన్ ‘ వీరమల్లు ‘ సంగతేంటి?

- Advertisement -