ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో భక్తులతో కిక్కిరిసిపోయింది తిరుమల. 29 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుండగా నిన్న స్వామివారిని 81,833 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,860 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించగా కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.31 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Also Read:ఏపీ బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం..
ఇక తిరుమల భక్తులకు గుడ్ న్యూస్. జూలై, ఆగస్టు నెలలకు చెందిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Also Read:అంతర్జాతీయ టీ దినోత్సవం..