అయోధ్యకు టీటీడీ లడ్డూలు

29
- Advertisement -

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అయోధ్యలో రామ్ లల్లా యొక్క ప్రాణ్-ప్రతిష్ఠ ప్రధాన వేడుకకు ఒక వారం ముందు జనవరి 16 న ప్రారంభంకానుండగా
వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ జనవరి 22న రామ్ లల్లాకు పట్టాభిషేకం, ప్రధాన ఆచారాలను నిర్వహిస్తారు. జనవరి 14 నుండి జనవరి 22 వరకు అయోధ్యలో అమృత మహోత్సవం జరుగుతుంది.

ఇక అయోధ్యలో జరిగే కార్యక్రమంలో భక్తులకు, వీవీఐపీలకు సద్భావనగా లక్ష 25గ్రాముల లడ్డూలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. సనాతన ధర్మాన్ని అనుసరించే వారందరికీ ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని, హిందూ మతం, సంస్కృతి, విలువలను ప్రచారం చేయడమే టీటీడీ ప్రధాన లక్ష్యం అన్నారు . రామజన్మభూమి పూజా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించడం గర్వకారణమని తెలిపారు.

జనవరి 22న అయోధ్య విమానాశ్రయంలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు దాదాపు 100 చార్టర్డ్ విమానాలు దిగనున్నాయి. జనవరి 22న జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు ప్రధాని మోడీ. అయితే అందరూ అయోధ్యకు రాలేకపోయినా కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఆకాంక్షించాలన్నారు.

Also Read:‘గుంటూరు కారం’ టార్గెట్ ఎంతంటే?

- Advertisement -