Kadiyam:2028లో అధికారం బీఆర్ఎస్‌దే

13
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమావేశంలో మాట్లాడిన కడియం..1978 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం లో రకరకాల రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. .ఎన్ఠీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చినా 1989 లో ఓడిపోయారు .మళ్ళీ 1994 లో కాంగ్రెస్ ను ప్రతిపక్ష హోదా దక్కకుండా ఓడించారన్నారు. రాష్ట్రంలో ఇపుడు కూడా ప్రజలు మార్పు కోరుకున్నారు ..రాజకీయాల్లో ఇది సహజం అన్నారు. ఓటమి గురించి ఎక్కువ భాధ పడాల్సిన అవసరం లేదన్నారు.

భవిష్యత్ మనదే ..2028 లో అధికారం బీ ఆర్ ఎస్ దే అన్నారు. కాంగ్రెస్ లో అపుడే కుమ్ములాటలు మొదలయ్యాయని,..పొంగులేటి తానే నెంబర్ 2 అంటున్నారు ..భట్టి కి సీఎం పదవి రాలేదని ఆయన భార్య వాపోతున్నారన్నారు. కాంగ్రెస్ లో ఎవరికి వారే యమునా తీరే …కాంగ్రెస్ 420 హామీలు నెరవేర్చే పరిస్థితి ఉండదన్నారు. కేటీఆర్ ,హరీష్ రావు లు కృష్ణార్జునులు ..వారు కలిసికట్టుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలన్నారు. కార్యకర్తలకు అగ్రనాయకత్వం అందుబాటులో ఉండాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు పై స్పష్టత లేదని,దళిత బంధు కింద కేసీఆర్ పది లక్షలు ఇస్తే దాన్ని పన్నెండు లక్షల రూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టో లో పెట్టిందన్నారు.

గతం లో ఎంపికైన దళిత బంధు లబ్దిదారులకు సాయాన్ని ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గం అని,దళితులతో రాజకీయ చెలగాటం తగదు అన్నారు. మహబూబాబాద్ లో కష్టపడి పనిచేసి పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుందాం అన్నారు.

Also Read:KTR:చేసిన పని చెప్పుకోలేకపోయాం..అందుకే ఓటమి

- Advertisement -