రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతం కోనసాగుతుంది పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి ఏడుకొండలపై ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ సాత్వా నంద సరస్వతి స్వామీజీ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి నేడు తిరుమల కొండపై మొక్కలు నాటారు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ మానవ మనుగడ కొనసాగాలంటే చెట్లు మనకు ఎంతో ముఖ్యం అని మొక్కలు నాటడం ఛాలెంజ్ గా తీసుకొని నాటాలని పిలుపునిచ్చారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చాలా చక్కటి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్నారు అని దీనిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి దాని పోషణను తీసుకొని ఆ మొక్క పెద్దయ్యే వరకు బాధ్యత తీసుకోవాలని తెలిపారు.మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అందరూ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు టిటిడి బోర్డు సభ్యులు కే శివకుమార్.. చాలా రోజుల నుండి ప్రకృతిని కాపాడాలని మొక్కలు పెంచాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నా మిత్రులు విష్ణు జగతి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు తిరుమల తిరుపతి కొండపై మొక్కలు నాటడం జరిగింది అని తిరుమల అంటేనే పకృతి అని మనం చుట్టూ ఉన్న చెట్లు కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్నవి అని ఈరోజు నాటిన ఈ మొక్కలు కూడా వాటి లాగ మహా వృక్షాలుగా కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అని తెలిపారు.
ఇప్పటికే మనం చాలా వాతావరణ కాలుష్యానికి గురవుతున్నామని ఢిల్లీ; హైదరాబాద్ లాంటి మహానగరాల్లో చాలా వాతావరణ కాలుష్యం పెరిగి పోయిందని అలాంటి పరిస్థితి రావద్దంటే ప్రతి ఒక్కరు వారి ఇంటి ముందు ఒక మొక్కను నాటుకునే విధంగా శ్రద్ధ తీసుకోవాలని కోరారు. సంతోష్ గారు నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లో సినీనటుడు; గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్ టిటిడి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.