నాబార్డు ద్వారా కొత్త పథకాలు: చింతల గోవిందరాజు

159
nabard

నాబార్డ్ ద్వారా కొత్త పథకాలు తీసుకురావాలనుకుంటున్నాం అని తెలిపారు నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజు.కోటి 8 లక్షల మైక్రో గ్రూప్ లు ఉన్నాయి.మహిళ లకు 2.5 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నాం అని తెలిపారు.దేశంలో కోటి 8 లక్షల గ్రూప్ లను ఈ శక్తి ప్లాట్ ఫాం మీదకు తీసుకురావాలనుకుంటున్నాం అని తెలిపారు.

ఆత్మనిర్భర్ భారత్ కింద రైతులు, మహిళ గ్రూప్ లనం బలోపేతం చేయాలనుకుంటున్నాం అని తెలిపిన గోవిందరాజు…ప్రాథమిక సహకార సంఘాలకు కేవలం 3 శాతం వడ్డీ కి రుణాలు ఇస్తున్నాం అని తెలిపారు. నిన్న సీఎం కేసీఆర్ తో మాట్లాడిన 800 సోసైటీలు ఉన్నాయి.. అదే స్థాయిలో గోడౌన్‌లు కట్టాలని నిర్ణయించాం.కోఅపరేటివ్ సొసైటీ లను అన్నింటినీ కంప్యూటరైజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

కోఅపరేటివ్, గ్రామీణ బ్యాంకు లను బలోపేతం చేస్తున్నాం.కరోనా వచ్చాక మార్చి 1 నుంచి జూలై వరకు 80 వేల కోట్ల రుణాలు మంజూరు చేశాం.ఈ సంవత్సరం 5.30 లక్షల కోట్ల నుంచి 6.5 లక్షల కోట్ల బిజినెస్ టార్గెట్ గా పనిచేస్తున్నాం అన్నారు.

42 శాతం బిజినెస్ నాలుగు రాష్ట్రాల నుంచే ఏపీ తెలంగాణ, కర్ణాటక, తమిళ నాడు నుంచే ఉంటుంది.రైతుల ఆదాయం పెంపొందించేందుకు నాబార్డు ద్వారా ప్రయత్నం చేస్తోందన్నారు.అగ్రికల్చర్ లో క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ తీసుకురాబోతున్నాం.పుడ్ ప్రాసెసింగ్ కోసం స్వయం సహాయక గ్రూప్ లకు 5శాతానికే లోన్లు ఇస్తున్నాం.కాళేశ్వరం ప్రాజెక్టు కు డబ్బులు ఇచ్చాం.. రెండో ప్రాజెక్టు కు ఇవ్వబోతున్నాం.తెలంగాణ లో 900 కోట్లతో చెక్ డ్యామ్ లను నిర్మిస్తున్నాం.రుణమాఫీ అనేది పొలిటికల్ నిర్ణయం. మాఫీ డబ్బులు పూర్తిగా బ్యాంకు లకు చెల్లించాలన్నారు.