నెంబర్‌ 1గా చమురు దిగ్గజ సంస్థ సౌదీ ఆరాంకో!

28
saudi

రష్యా – ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధంతో చమురు ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చమురు దిగ్గజ సంస్థ సౌదీ ఆరాంకో షేరు అమాంతం పెరిగిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది సౌదీ ఆరాంకో.

ఇదే క్రమంలో దిగ్గజ మొబైల్ సంస్థ ఆపిల్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. సౌదీ ఆరాంకో సంపద 2.43 ట్రిలియన్ డాలర్లు కాగా, ఆపిల్ సంపద 2.37 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ ఏడాది ఆరంభంలో ఆపిల్ 3 ట్రిలియన్ డాలర్ల మార్కును అందుకుని చరిత్ర సృష్టించగా తాజాగా ఆపిల్‌ని అధిగమించింది సౌదీ ఆరాంకో సంస్థ.

2019లో పబ్లిక్ ఇష్యూకి వెళ్లాక సౌదీ ఆరాంకో దశ తిరిగిపోయింది. ప్రస్తుతం సింగిల్ బ్యారెల్ ధర 106.2 డాలర్లకు చేరగా సౌదీ ఆరాంకో షేర్ల విలువ 27 శాతం శాతానికి ఎగిసింది.