తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. శ్రీవారికి కానుకల రూపంలో వచ్చిన వాచీలను వేలం వేయాలని నిర్ణయించింది. ఈ నెల 22న వేలం వేయనుండగా టైటాన్, టైమెక్స్, సొనాట, టైమ్‌వెల్, ఆల్విన్, క్యాషియో, ఫాస్ట్‌ట్రాక్ వాచీలు ఉన్నాయి. అలాగే హుండీ ద్వారా కానుకగా వచ్చిన బియ్యాన్ని కూడా ఈ నెల 28న వేలం వేయనుంది టీటీడీ.
కొత్తవి, ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 10 లాట్లు ఈ-వేలంలో ఉంచారు. ఇతర వివరాలకు టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.
Also Read:కాకిదొండతో షుగర్ కు చెక్..
28న బియ్యాన్ని వేలం వేయనున్నారు. ఇందులో మిక్సిడ్ బియ్యం 13,080 కేజిలు టెండర్ మరియు వేలంలో ఉంచనున్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం జూన్ 29న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు.
Also Read:ఆడవారు గాజులు ఎందుకు ధరిస్తారో తెలుసా..!