ఆడవారు గాజులు ఎందుకు ధరిస్తారో తెలుసా..!

535
ladies bangles

ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయ స్త్రీని సులువుగా గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే చేతికి గాజులు, కాళ్ళకి పట్టీలు ఉంటాయి కాబట్టి. ఇవి కేవలం సంప్రదాయానికి సంబంధించిన వస్తువులు , ఆచారాలు అని అనుకుంటారు..కానీ నుదుట బొట్టుపెట్టుకునే దగ్గరి నుండి చేతులకు గాజులు,కాళ్లకు పట్టీలు వేసుకోవడం వరకు ప్రతిదానికి ఓ అర్ధం ఉంది.

ఆడవారి చేతికి గాజులే అందం అలంకారం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు గాజులు వేసుకోవడమే మానేశారు. ఆ చేతికి ఒక డజను ఇ చేతికి ఒక డజను గాజులు వేసుకోని ఆడవాళ్లు కనిపిస్తే చూడటానికి ఎంత ఉంటుందో కానీ ఇప్పుడు అద్దం పెట్టివెతికినా అలాంటివారు కనిపించరు. కానీ ఆడవారు చేతులకు గాజులు వేసుకోవడం వెనుక సైన్స్ దాగుంది.

పూర్వకాలంలో మగవాళ్లు చాలా కష్టపడే వాళ్లు…శారీరకంగా చాలా పనులు చేసేవాళ్లు కానీ మహిళలు ఇంటిపనికే పరిమితం అయ్యేవాళ్లు. ఇలా ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఇంట్లోనే ఉండటం వల్ల మహిళలు ఎక్కువగా రక్తపోటు సమస్యతో బాధపడేవాళ్లు.

TRUE SIGNIFICANCE OF BANGLES IN INDIAN CULTURE | by Shivam Kumar | Medium

దీంతో మహిళలు ఆలాంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలని భావించిన మన పూర్వీకులు వాళ్ల చేతులకు గాజులు వేసుకునే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. మణికట్టుపై ఉండే గాజులు శరీరాన్ని యాక్టివేట్ చేస్తాయి. గాజులు ఒకదానికొకటి రాపిడి చేయడం వల్ల బ్లడ్ ప్రెజర్ నార్మల్‌గా ఉంటుంది. గాజుల ద్వారా చర్మానికి ఎలక్ట్రిసిటీ అందుతుంది.

గాజుల వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ట‌. గాజులు ఎల్ల‌ప్పుడూ చేతి న‌రాల‌కు తాకుతూ ఉండ‌డం వ‌ల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌.ఇక కాళ్లకు పట్టీలు వేసుకోవడం వల్ల ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, మహిళలు సంతోషంగా ఉంటే, ఇల్లంతా సంతోషంగా ఉంటుందని పెద్దలు చెప్పేవారు. నుదుట‌న కుంకుమ బొట్టును ధ‌రిస్తే అక్క‌డి న‌రాలు ఉత్తేజిత‌మై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయ‌ట‌. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ట‌.ఇలా మహిళలు ధరించే ఒక్క వస్తువు వెనుక ఒక్కో మంచిపని దాగుంది.