కాకిదొండతో షుగర్ కు చెక్..

167
kaki donda
- Advertisement -

సాధారణంగా దొండకాయలలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి మనం వంటింట్లో వినియోగించే కూరగాయలలో ఒకరకం దొండకాయ అయితే.. మరోటి బయట దొరికే దొండకాయ మరోరకం. ఇది పల్లెటూళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ దొండకాయను కాకి దొండ లేదా అడవి దొండ అని కూడా పిలుస్తారు. ఈ దొండ కాయ చేదుగా ఉంటుంది. దీన్ని ఆయుర్వేదంలో పూర్వం నుంచి వినియోగిస్తున్నారు. ఈ కాకి దొండలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, ఆరోగ్యానికి బాగా ఉపయోగ పడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

కాకి దొండలో ఫైబర్, ఐరన్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని వొండుకొని తింటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పట్టి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. .ఈ కాకిదొండలో యాంటీ యాక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి మెదడు చురుకు పని చేయడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. అంతే కాకుండా క్యాన్సర్ కరకాలను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా ఈ కాకిదొండ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాకిదొండలో ప్రతి భాగం కూడా షుగర్ వ్యాధిని నియంత్రించే గుణాలను కల్గి ఉంటుంది.

కాకిదొండ ఆకు లేదా ఖండం యొక్క రసాన్ని 20 నుంచి 30 గ్రాముల మోతాదులో 40-80 రోజులపాటు ప్రతిరోజూ తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి కంట్రోల్లోకి వస్తుంది. అలాగే షుగర్ వల్ల వచ్చే నీరసం, అలసట వంటికి కూడా తగ్గుతాయి. ఇక కాకిదొండ రక్త హీనతను తగ్గించే గుణాలను కూడా కల్గి ఉంటుంది. అలాగే కాకిదొండను వొండుకొని తినడం వల్ల కిడ్నీ సమస్యలను కూడా దూరం చేస్తుంది. ముఖ్యంగా కిడ్నీ లోని రాళ్ళను కరిగించి మూత్రం ద్వార బయటకు పోయేలా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక గజ్జి, తామర, దురద, ఫంగల్ వంటి సమస్యలు ఉన్నవాళ్లు కాకిదొండ ఆకులను పేస్ట్ లాగా చేసుకొని వాడడం వల్ల ఎలాంటి చర్మ వ్యాధులైన దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

  Also Read:తమలపాకుతో ఉపయోగాలు..

- Advertisement -