కరెంట్ బిల్లులు చెల్లించండి:సీఎండీ రఘుమారెడ్డి

388
raghuma reddy
- Advertisement -

కరెంట్ బిల్లులపై అవాస్తవాలను నమ్మవద్దని…కరెంట్ బిల్లులు చెల్లించి సహకరించాలన్నారు టీఎస్ ఎస్పీడిసిఎల్ సిఎండి రఘుమా రెడ్డి. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో డొమెస్టిక్ లో 9 స్లాబ్ లు, 3 కేటగిరీలు ఉన్నాయని చెప్పారు.

100 వరకు ఒక్కటి, 100-200 వరకు ఒక్కటి,200 పై బడి మూడో స్లబ్ ఉందని..ఎక్కడ కూడా విద్యుత్ బిల్ పెంచడం లేదు ఉన్న టారిఫ్ లో మాత్రమే ఇస్తున్నామని తెలిపారు. ఎస్పీడిసిఎల్ లో 95 లక్షల వినియోగదారులు ఉన్నారు 75 లక్షల డొమెస్టిక్ వినియోగదారులు ఉన్నారని వెల్లడించారు. 200 కంటే తక్కువ వినియోగించేవారూ 80 శాతం ఉన్నారన్నారు.

గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం వేసవికాలంలో కరెంట్ వాడకం పెరిగింది ఎందుకంటే కరోనా వైరస్ మూలన ఎక్కడకు వెళ్ళకుండా ఇండ్లలోనే ఉన్నాం కనుక. మార్చి లో 67 శాతం వినియోగదారులు మాత్రమే బిల్ కట్టారని..ఏప్రిల్ నెలలో 44 శాతం మాత్రమే బిల్ పే చేశారని వెల్లడించారు.

మే నెలలో68 శాతం మాత్రమే బిల్ పే చేశారు అయితే మొత్తం యావరేజ్ గా 60 శాతం మాత్రమే బిల్ కట్టారని…తమకు కొన్ని ఫిర్యాదులు వచ్చయి.వాటిని మేము పరిశీలించాము.వాటి అన్నింటిపై వివరణ ఇచ్చామని వెల్లడించారు.

ఈ నెలలో ఎక్కువ బిల్ వచ్చినట్లు అయితే వచ్చే నెల బిల్ లో కూడా అడ్జెస్ట్ చేస్తాం అని…3 నెలల పాటు ఇంట్లోనే ఎక్కువగా ఉన్నారు కాబట్టి బిల్ ఎక్కువగా వచ్చిందన్నారు. ఈఆర్సీ అప్రూవల్ తీసుకునే బిల్ లు ఇచ్చామని….మనం చేసే విధానం ను ఇతర ఈఆర్సీ వాళ్ళు చేశారన్నారు.

వినియోగదారులు అన్నప్పుడు బిల్ కట్టాల్సిందే ఎందుకంటే ఈ ప్రభుత్వ సంస్థ ఇందులో ఎలాంటి సమస్య లేదు ఎక్కడ కూడా తప్పుడు బిల్లు ఇవ్వలేదన్నారు. మేము ఇచ్చే బిల్ లలో ఎలాంటి తప్పులు చేయలేదు ఉన్నది ఉన్నట్టు ఇస్తున్నాం అన్నారు.

బిల్ లు అందరూ కట్టాలని….ఎక్కువ కట్టిన వారి బిల్ ఎక్కడికి పోవడం లేదన్నారు. మార్చి,ఏప్రిల్ ,మే నెలలో ఎంత వాడుకున్నారు అని మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు ఎందుకంటే కరోనా వలన బయటకు ఎవరు పోలేదు కాబట్టి ఎంత వాదుకున్నది ఎవరికి తెల్వదు .ఒకవేళ ఎక్కువ కట్టిన మళ్ళీ అడ్జెస్ట్ చేస్తాం అన్నారు.

- Advertisement -