పూర్తి స్థాయిలో బసుల సౌకర్యం..

600
TSRTC
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సమకూరుస్తున్న ప్రజా రవాణా సౌకర్యం రోజు రోజుకు మెరుగుపడుతోంది. ముఖ్యమంత్రి, రవాణా మంత్రి ఆదేశాల మేరకు వంద శాతం బస్సుల్ని తిప్పే దిశలో ప్రత్యేక కార్యాచరణను అమలు పరుస్తూ అధికార యంత్రాంగం తమవంతు ప్రయత్నిస్తోంది.

బస్సులను సాధ్యమైనంత వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంచడానికి డిపో మేనేజర్లు తగిన కృషి చేస్తుండటంతో ప్రజా రవాణా ఒకింత మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. గత రెండు రోజులుగా బస్సుల శాతాన్ని గమనించినట్లయితే, క్రమంగా పెరుగుతున్నట్లు కనబడుతోంది.

సంస్థ ఎం.డి, టి.ఆర్‌ అండ్‌ బి ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ, ఐ.ఎ.ఎస్‌ ప్రయాణీకులకు అందిస్తున్న ప్రజా రవాణా సేవలపై ఉన్నతాధికారులను నుంచి సమాచారాన్ని తెప్పించుకుంటూ పరిశీలిస్తున్నారు. ఈ మేరకు అధికారులకు ఆయన తగు సూచనలు ఇస్తూ దిశా నిర్ధేశం చేస్తున్నారు.

కాగా, గురువారం నడిపిన బస్సుల సంఖ్య, రోజువారీ డ్రైవర్‌, కండక్టర్ల తదితర వివరాలను ఈ విధంగా ఉన్నాయి.

సర్వీసులు మొత్తం – 6672, శాతం – 74.56
(ఆర్టీసీ బస్సులు -4705 అద్దె బస్సులు – 1967)

రోజువారీ పద్ధతిలో విధులు నిర్వహించిన సిబ్బంది
( ప్రైవేట్‌ డ్రైవర్స్‌ – 4705 ప్రైవేట్‌ కండక్లర్స్‌ – 6672)

సర్వీసుల్లో అందుబాటులోకి తీసుకువచ్చిన టిక్కెటింగ్‌ విధానం
(టిక్కెట్ల జారీ -1941 టిమ్స్‌ – 1024)

- Advertisement -