టీఎస్ఎల్ఆర్బీ పరీక్షల తేదీల మార్పు..

57
- Advertisement -

తెలంగాణలో కానిస్టేబుల్ అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు (టీఎస్ఎల్ఆర్బీ) ఒక న్యూస్‌ ప్రకటించింది. పోలీసు తుది నియామక పరీక్షల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి మేరకు పోలీసు నియామక మండలి తేదీలను మార్పులు చేసింది. ఇందులో నాలుగు పరీక్షల్లో మార్పులు చేసినట్టు ప్రకటించింది. కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటీ), ఎస్‌ఐ (ఐటీ), ఏఎస్‌ఐ (ఫింగర్ ప్రింట్స్) పరీక్షల తేదీలను మార్చారు. మార్చి 12న జరగాల్సిన కానిస్టేబుల్ (ఐటీ), ఎస్‌ఐ (ఐటీ), ఏఎస్‌ఐ (ఫింగర్ ప్రింట్స్) పరీక్షలను ఒక రోజు ముందుగా అంటే మార్చి 11న నిర్వహించనున్నారు. కానిస్టేబుల్‌ పరీక్షను ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీకి మార్చారు.

ఇవి కూడా చదవండి…

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఒడిషా మాజీ సీఎం

యాపిల్ సీఈవో కుక్‌ జీతంలో కోత..

ముంబై..పారిశ్రామిక దిగ్గజాలతో కేటీఆర్‌

- Advertisement -