యాపిల్ సీఈవో కుక్‌ జీతంలో కోత..

58
- Advertisement -

యాపిల్ సీఈవో టిమ్ కుక్ జీతంలో కోత పడింది. తానే స్వయంగా జీతంలో కోత విధించుకున్నారు. గ‌త ఏడాది టిమ్ 100 మిలియ‌న్ల డాల‌ర్లు ఆర్జించగా జీతం కోత వ‌ల్ల ఈ ఏడాది టిమ్ కుక్ 49 మిలియ‌న్ల డాల‌ర్లు తీసుకోనున్నారు. షేర్‌హోల్డ‌ర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా జీతాన్ని ఫిక్స్ చేయ‌నున్నారు.

కుక్ కూడా జీతం త‌గ్గింపు కోసం రిక‌మండ్ చేసిన‌ట్లు కంపెనీ తెలిపింది. కుక్‌కు ఇవ్వాల్సిన 49 మిలియ‌న్ల డాల‌ర్ల ప‌రిహారంలో.. 3 మిలియ‌న్ల డాల‌ర్ల శాల‌రీ, ఆరు మిలియ‌న్ల డాల‌ర్ల బోన‌స్‌తో పాటు 40 మిలియ‌న్ల డాల‌ర్ల ఈక్విటీ క‌ల‌ప‌నున్నారు.

త‌న జీతాన్ని త‌గ్గించాల‌ని టిమ్ కుక్‌నే కోరిన‌ట్లు కంపెనీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -