నాసా ఛాలెంజ్‌కి తెలంగాణ టెకీలు..

213
TS students selected by NASA
- Advertisement -

వచ్చే సంవత్సరం అమెరికాలో నాసా నిర్వహించే ఐదవ విడత హ్యూమన్ ఎక్స్ ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ లో పాల్గొనే అరుదైన అవకాశం ఐదుగురు తెలంగాణ విద్యార్థులకు దక్కింది. వరంగల్ లోని ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఐదుగురి టీమ్, ఫైనల్ చాలెంజ్ కి క్వాలిఫై అయింది. రాయినేని ప్రకాశ్‌, పాల్‌ వినీత్‌, మనోజ్‌ చౌదరి, శ్రావణ్ రావు, రొండ్ల దిలీప్‌ రెడ్డి, వేనిశెట్టి స్నేహ కలిసి రోవర్‌ మోడల్‌ను రూపొందించారు.

చంద్రుడిపై తిరిగేందుకు అవసరమయ్యే వాహనం ఎలా ఉండాలి? దాని డిజైన్ పై వీరి ఐడియా, ప్రయాణికుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై వీరు సమర్పించిన రిపోర్టు తుది రౌండుకు అర్హత పొందిందని కాలేజీ యాజమాన్యం తెలిపింది.

మరో ప్రపంచం ఎలా ఉంటుందన్న ఊహతో, అక్కడ ఎలాంటి ఉపరితలం ఉన్నా, దానిపై క్షేమంగా, సులువుగా ప్రయాణించే వాహనాలను తయారు చేసే చాలెంజ్ లో పాల్గొనే అవకాశం తమకు రావడం ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థులు అంటున్నారు. నాసా ఛాలెంజ్‌లో విజయం సాధిస్తామని విద్యార్థులు ధీమా వ్యక్తం చేశారు. ఖగోళ అన్వేషణలో తమ ప్రతిభను చూపేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు వారు తెలిపారు. అట్లాంటా కాంపిటీషన్‌లో తమ రోవర్‌ తప్పకుండా విజయం సాధిస్తుందని విశ్వాసంతో చెబుతున్నారు.

యూఎస్‌లోని అలబామాలో ఉన్న హంట్స్‌విలేలో ఏప్రిల్-2018లో జరిగే ఐదో వార్షిక ఛాలెంజ్ కార్యక్రమంలో విద్యార్థుల బృందం పాల్గొననుంది. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఇండియా నుంచి మొత్తం 4 టీమ్‌లు షార్ట్‌ లిస్టు అయ్యాయి. వీటిలో తెలంగాణ నుంచి ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ బృందం ఒకటి. ఈ పోటీల్లో 23 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు.

- Advertisement -