తెలంగాణ హైకోర్టు మెగాస్టార్ చిరంజీవికి షాకిచ్చింది. జూబ్లీహిల్స్ కోపరేటివ్ హౌసింగ్ సోసైటీకి సంబంధించిన 595 చదరపు గజాల స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని చిరంజీవికి సూచించింది.ఆ స్థలంలో యథాతథ స్థితిని కొనసాగించాలని జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.తదుపరి విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది.
గతంలో పబ్లిక్ పర్పస్ కోసం ఆ స్థలాన్ని వినియోగించాలని జీహెచ్‌ఎంసీకి జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఆ స్థలం అప్పగించింది. తర్వాత అదే స్థలాన్ని చిరంజీవికి అప్పగించారు. దీనిపై సవాల్ చేస్తూ శ్రీకాంత్ బాబు హైకోర్టును ఆశ్రయించారు.
ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం సొసైటీ జాగాలో నిర్మాణాలు చేపట్టరాదని చిరంజీవితో పాటు మరి కొందరిని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని సొసైటీ, చిరంజీవి, జీహెచ్‌ఎంసీకి నోటీసులిచ్చింది.
ఇవి కూడా చదవండి..