‘RRR’ టిక్కెట్ రేట్లపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం..

44
- Advertisement -

దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. డివివి ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై దాన‌య్య ఈ చిత్రాన్ని 550కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించాడు. ప్రస్తుతం ట్రిపుల్ఆర్ బృందం ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా గడుపుతుంది. ఈ క్ర‌మంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు తెలంగాణ సర్కారు తీపి కబురు అందించింది. టికెట్ రేట్ల‌ను పెంచుకునేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది.

సాధారణ థియేటర్లలో తొలి మూడు రోజులకు రూ. 50, ఆ తర్వాత వారం రోజులకు రూ. 30 పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అంతేకాదు ఐమ్యాక్స్ థియేటర్లు, స్పెషల్ కేటగిరీ థియేటర్లలో మొదటి మూడు రోజులు రూ. 100, ఆ తర్వాత వారం రోజులు రూ. 50 పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ చిత్రంలో అజయ్ దేవ్ గణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్, సముద్రఖని, శ్రియ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు.

- Advertisement -