- Advertisement -
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు గుత్తా. ఇటీవల తనను కలిసిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఇక రాష్ట్రంలో గత 24 గంటల్లో 12వేల 590 మందికి కరోనా పరీక్షలు చేయగా, 175 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 98 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 8 కేసులు వెల్లడయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 2,077గా ఉన్నాయి.
- Advertisement -