అమ్రాపాలీ.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అని అనుకుంటుర్రా… అవును మీరు అనుకుంటున్నది నిజమే.. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రాపాలీ మేడం గురించే నేను చెబుతున్నా .. ఆమెను చూస్తే ఉత్తేజం.. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఉత్సాహం.. ఆమే ఏం చేసినా సమ్ థింగ్ స్పెషల్…. ఏం మాట్లాడినా ప్రత్యేకమే.. ఎంతో మంది యువత ఆమెను రోల్‌మాడల్ గా భావిస్తారు. అందం.. అనుకువ.. ధైర్యం.. తెగువ.. ఇవన్నీ కలగలిసి ఉన్న ఈ యువ కలెక్టర్‌ను… కలెక్టర్ అంటే ఇలా ఉండాల్రా అంటూ అంతా ప్రశంసిస్తున్నారు.
ఇప్పటికే తనదైన పనితీరుతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఈ యువ లేడి కలెక్టర్ వరంగల్ అర్బన్ జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. ఆత్మీయత, మానవీయ కోణంతో జనంలోకి దూసుకెలుతున్నారు. కలెక్టర్ అమ్రాపాలీని ప్రతి నిస్సహాయుడు మా అన్నపూర్ణ అని, ప్రతి మహిళా మా మా అక్క, మా అండ అని అనుకునేంతగా జనంలో తిరుగుతూ, వారితో మమేకమవుతూ వారిలో ఒకరిగా కలిసిపోతోంది ఈ కలెక్టరమ్మ. తన మాట, మంచితనంతో ఇప్పటికే ఎందరి జీవితాల్లో వెలుగులు నింపిన అమ్రాపాలీ ఇప్పటికే ఎన్నో అవార్డులను గెలుచుకుంది. ఈ మద్యే ఈ యువ కలెక్టర్ స్కోచ్ అవార్డుకు ఎంపికైంది.
తాజాగా ఈమెను మరో అదృష్టం వరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టి నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని మంచి పనితీరు కనబర్చినందుకు జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకును సొంతం చేసుకుని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ నుంచి అవార్డును కూడా అందుకుంది అమ్రాపాలి. ముందు ముందు కలెక్టర్ అమ్రాపాలీ మరిన్ని అవార్డులను గెలుచుకోవాలని, ఆమెకు మరింత మంచి పేరు రావాలని మనమూ కోరుకుందాం.