ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో కమల్ హాసన్ హీరోగా 1996లో వచ్చిన చిత్రం ‘భారతీయుడు’ అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో కమల్ ద్విపాత్రాభినయంతో నట విశ్వరూపాన్నిచూపించాడు. అద్భుత విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ తెరకెక్కించబోతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
ఇక దర్శకుడు శంకర్ ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా 2.ఓ చిత్రం రూపొందించే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోగానే ఇండియన్ 2 తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారట. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకూ శంకర్ రూపొందించిన ఒకటి రెండు సినిమాలు మినహా అన్ని చిత్రాలకు సంగీతం అందించారు ఏఆర్ రెహమన్.
అయితే ఇక ఇండియన్ 2 చిత్రానికి రెహమన్ సంగీతం అందించడంలేదనే సమాచారం వినిపిస్తోంది. తాజాగా ఆయన స్థానంలో యంగ్ మ్యూజిక్ డెరెక్టర్ అనిరుధ్ చేరిపోయాడనే వార్త జోరుగా వినిపిస్తోంది. మరి ఈ వార్తలో నిజమెంతుందొ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం కమల్ హాసన్ రాజకీయాల్లో అడుగులేసేందుకు తెరవెనకాల ప్రయత్నాలు చేస్తున్నాడు.