అఖిల్‌కి నాగ్‌-చెర్రీకి మెగాస్టార్..!

177
ram charan

అక్కినేని అఖిల్ హీరోగా ముచ్చటగా మూడో చిత్రం సిద్ధమవుతోంది. జూన్ మొదటి వారం షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. తొలి ప్రేమతో మంచి హిట్ సాధించిన వెంకీ..అఖిల్‌కు మంచి హిట్ ఇచ్చేలా సినిమాను తెరకెక్కించేలా కథను సిద్ధం చేశాడు. అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటించనున్న ఈ సినిమాకు నాగార్జున మూవీ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. నాగ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ సాధించిన చిత్రం మజ్నూ. అయితే, ఈ టైటిల్‌తో నాని వచ్చిన నేపథ్యంలో మిస్టర్ మజ్నూ అనే పేరును పరిశీలిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించలేదు.

మరోవైపు టాలీవుడ్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సినిమాల్లో రామ్ చరణ్ – బోయపాటి శ్రీను చిత్రం ఒకటి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కూడా మెగాస్టార్ సినిమా టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. చిరు కెరీర్‌లో జగదేకవీరుడు అతిలోక సుందరి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా కథ మొత్తం రాయల్ ఫ్యామిలీకి సంబంధించినది కావడంతో ‘రాజమార్తాండ’ అనే టైటిల్‌ను పెట్టాలని ముందు అనుకున్నారట. అయితే ఆ టైటిల్‌ను కాదని ఇప్పుడు ‘జగదేకవీరుడు’ అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోందని ఫిల్మ్ నగర్ సమాచారం. చెర్రీ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తు్నన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్, స్నేహా, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మొత్తంగా నాగ్‌ మూవీ టైటిల్‌తో అఖిల్,చిరు మూవీ టైటిల్‌తో చెర్రీ వస్తే ఫ్యాన్స్‌కు వచ్చే కిక్కే వేరు. మరి నిజంగా వీరి సినిమాలకు ఈ టైటిల్స్‌నే ఖరారు చేస్తారా.. లేక ఇదీ ఒక రూమర్‌గానే మిగిలిపోతుందా? తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.