ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (UNGA) 81వ సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు తనను తాను శాంతిదూతగా (Peacemaker) చిత్రీకరించుకుంటూనే, మరోవైపు ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తానంటూ (Annihilate) హెచ్చరికలు జారీ చేయడం ఆయన ప్రసంగంలోని ప్రధాన వైరుధ్యాన్ని ఎత్తిచూపుతోంది.
ఐరాసలో ప్రసంగిస్తూ ఇరాన్‌తో శాంతి ఒప్పందానికైనా సిద్ధపడాలి, లేదా ఆ దేశాన్ని “సర్వనాశనం” చేసేందుకైనా సిద్ధంగా ఉండాలని ట్రంప్ వ్యాఖ్యానించారు.తమ పాలనలో సాధించిన విదేశాంగ విజయాలను నెమరువేసుకుంటూ, ఒప్పందాల రాయబారిగా తనను తాను అభివర్ణించుకున్న ట్రంప్, ఇరాన్ ప్రస్తావన రాగానే తీవ్రమైన వైఖరిని ప్రదర్శించారు. వాషింగ్టన్‌తో సంప్రదింపులకు రావాలని, లేకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలు పొందడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
“నా ముందు ఒక పెద్ద నిర్ణయం ఉంది. ఇరాన్‌తో మళ్లీ ఒప్పందం కుదుర్చుకుని, అది మునుపటి కంటే గొప్ప దేశంగా మారేందుకు అవకాశం ఇవ్వాలా? లేక ఆ ఇస్లామిక్ రిపబ్లిక్‌ను త్వరితగతిన సర్వనాశనం చేసి, ఇకపై ఇతర దేశాలను, ప్రజలను నాశనం చేయకుండా అడ్డుకోవాలా?” అని ప్రశ్నించారు.అంతటితో ఆగకుండా, “వారికి బతికే అవకాశం లేకుండా నరకానికి పంపాలా?” అని సభను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Also Read:ఆసియా గేమ్స్..భారత్‌కు మరో పతకం
ఒకవైపు “ఇతరులు కేవలం మాట్లాడారు, కానీ నేను శాంతిని స్థాపించాను” అని చెప్పుకున్న ట్రంప్, అదే సమయంలో ప్రత్యర్థులను పూర్తిగా తుడిచిపెట్టేస్తామనే పదజాలాన్ని ఉపయోగించడం ఆయన ప్రసంగంలో స్పష్టమైన వైరుధ్యాన్ని ఎత్తిచూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

