ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం దక్కింది. భారత్‌కు చెందిన అనంతజీత్ సింగ్ నరుకా, గురుజోత్ ఖంగురా, మరియు మైరాజ్ అహ్మద్ ఖాన్‌లతో కూడిన జట్టు కాంస్య పతకాన్ని (Bronze Medal) సాధించింది.
ఇండైవిడ్యువల్ ఈవెంట్: అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన అనంతజీత్ సింగ్ నరుకా, వ్యక్తిగత విభాగాన (Individual Final) ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించాడు.
ఏషియన్ గేమ్స్ షూటింగ్ పోటీలలో భారత పురుషుల స్కీట్ టీమ్ మెరుగైన ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్లలో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ జట్టు మొత్తం కలిసి కీలకమైన పాయింట్లను సాధించి పతకాన్ని ఖాయం చేసుకుంది.
మరోవైపు, భారత స్టార్ షూటర్ అనంతజీత్ సింగ్ నరుకా క్వాలిఫికేషన్‌లో అత్యుత్తమ స్కోరు సాధించి వ్యక్తిగత స్కీట్ ఫైనల్ పోరుకు అర్హత సాధించాడు. దీంతో ఆయన వ్యక్తిగత విభాగంలో కూడా భారత్‌కు మరో పతకం అందించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
Also Read:చాలా డిఫరెంట్‌గా ‘ది ప్యారడైజ్’

