కిమ్‌తో మాట్లాడుతానంటున్న ట్రంప్‌..!

237
Trump says he would 'absolutely' talk to Kim on phone
- Advertisement -

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో ఫోన్లో మాట్లాడతానంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. ఉ.కొరియా వరుస క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో కొద్ది రోజులుగా ట్రంప్‌, కిమ్‌ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్‌ శనివారం మేరీల్యాండ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిమ్‌తో మాట్లాడుతారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు..‘తప్పకుండా మాట్లాడుతాను. నాకు ఆయనతో మాట్లాడటంలో ఎలాంటి అభ్యంతరం లేదు.

Trump says he would 'absolutely' talk to Kim on phone

కాకపోతే అందుకు కొన్ని షరతులు ఉంటాయి. వింటర్‌ ఒలింపిక్స్‌ నేపథ్యంలో ద.కొరియా, ఉ.కొరియా మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఇది నిజంగా చాలా గొప్పవిషయం. నేను కలగజేసుకోపోయి ఉంటే ఆ ఇరు దేశాల మధ్య ఎప్పటికీ చర్చలు జరిగేవి కావు. చర్చలు ఫలిస్తే ప్రపంచానికే అది శుభవార్త అవుతుంది’ అని సమాధానమిచ్చారు ట్రంప్‌.

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ప్రతినిధులు రెండేళ్ల అనంతరం మొదటిసారిగా ఈ నెల 9న సమావేశం కానున్నారు. చర్చల కోసం సియోల్‌ పంపిన అభ్యర్థనకు ప్యాంగ్యాంగ్‌ అంగీకారం తెలపడంతో ఈ సమావేశాలకు మార్గం సుగమమైంది. అమెరికా, ద.కొరియా నిర్వహించే సంయుక్తం సైనిక విన్యసాలు వాయిదా పడిన కొన్ని గంటల్లోనే ఈ సమావేశం ఖరారు కావడం గమనార్హం. చివరిసారిగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య సమావేశం డిసెంబర్‌ 2015లో జరిగింది.

- Advertisement -