ఫైజర్ టీకా… అందరికీ ఉచితం: ట్రంప్

191
trump
- Advertisement -

కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్‌. బ్రిటన్‌లో ఇప్పటికే ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అనుమతి లభించగా టీకా అత్య‌వ‌స‌ర వినియోగానికి అమెరికా అనుమ‌తిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికన్లందరికీ ఫైజర్‌ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనున్నామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కేవలం తొమ్మిదినెలల్లోనే అద్భుతమైన విజయాన్ని సాధించామని, ఇది నిజంగా శుభవార్త అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. సైన్సుపరంగా చరిత్రలో ఇదొక చారిత్రాత్మక సందర్బమని పేర్కొన్నారు.

అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్-జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంయుక్తంగా కరోనా టీకాను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -