100% టారిఫ్..ట్రంప్‌కు పూర్తి అధికారం!

0
- Advertisement -

రష్యా నుండి చమురు మరియు గ్యాస్ కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై గరిష్టంగా 100 శాతం వరకు దిగుమతి సుంకాలను (టారిఫ్‌లు) విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కల్పించే ద్వైపాక్షిక బిల్లును ఇటీవల యూఎస్ సెనేట్ ఆమోదించింది. సెనేటర్ లిండ్సే గ్రాహం పేరిట తీసుకొచ్చిన ఈ శాన్క్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్” ద్వారా రష్యా ఇంధనాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనాల వంటి దేశాలపై ఆర్థిక ఒత్తిడి పెంచాలని అమెరికా భావిస్తోంది.

ఈ టారిఫ్ ప్రతిపాదనలపై అమెరికా వైట్ హౌస్ సీనియర్ అడ్వైజర్ పీటర్ నవారో మీడియా ప్రశ్నకు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య అత్యంత బలమైన, మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ రష్యన్ ఆయిల్ టారిఫ్ వివాదాన్ని వారిద్దరూ నేరుగా చర్చించుకుని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు

ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా నుండి భారత్ భారీగా ముడి చమురు దిగుమతి చేసుకుని దానిని శుద్ధి చేసి తిరిగి విక్రయించడంపై తాను గతంలో వ్యాసం రాశానని నవారో గుర్తుచేశారు. ఆ సమయంలో భారతీయ నెటిజన్ల నుంచి సోషల్ మీడియాలో తనకు తీవ్ర నిరసన ఎదురైందని అయితే అమెరికాలో సమస్యలను పరిష్కరించుకునే విధానం అది కాదని వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయంగా నిబంధనలు నడుస్తున్నప్పటికీ భారత్ తన ఇంధన అవసరాల దృష్ట్యా రష్యా నుండి రికార్డు స్థాయిలో చమురును దిగుమతి చేసుకుంటూనే ఉంది. జూన్ 2026 నాటికి భారత మొత్తం ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఆల్-టైమ్ గరిష్టంగా 48 శాతానికి చేరింది. ప్రస్తుతం ఈ బిల్లు యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం పొంది, చట్టంగా మారాల్సి ఉంది. ఒకవేళ ఇది పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ట్రంప్, మోడీ ద్వైపాక్షిక చర్చలపై ఆధారపడి ఉంటుంది.

Also Read:మ్యారేజ్ డే..మొక్కలు నాటిన సంతోష్ దంపతులు

- Advertisement -