ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. చర్చలు విఫలమైతే సైనిక చర్య అనేది ఒక ప్రత్యామ్నాయంగా ఉన్నప్పటి.. ఏ ఒప్పందంలోనైనా అణ్వాయుధాలకు వ్యతిరేకంగా స్పష్టమైన హామీ ఉండాలని ఆయన నొక్కి చెప్పారు.
మేము ఒక గొప్ప ఒప్పందాన్ని చేసుకుంటున్నాము.. లేదంటే మేము వెనక్కి వెళ్లి దానిని సైనికపరంగా ముగిస్తాము. మేము చాలా మంచి ఒప్పందానికి దగ్గరగా ఉన్నాము..ఒకవేళ అది మంచిగా కుదిరితే సరే, లేకపోతే మేము రక్షణ శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్)తో మళ్లీ చర్యలు ప్రారంభిస్తాము అని అన్నారు.
గతంలో వెనిజులాతో సహా జరిగిన సైనిక చర్యలను ట్రంప్ ప్రస్తావిస్తూ…వాటిని వన్-డే విన్స్ గా అభివర్ణించారు. అయితే ఒక సంతృప్తికరమైన ఒప్పందం కుదిరితే సైనిక ఉద్రిక్తతలను నివారించాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే వ్యూహాత్మక జలసంధులను (Straits) తిరిగి తెరవడం వంటి తక్షణ ప్రయోజనాలు ఉంటాయని కూడా ఆయన పేర్కొన్నారు.
Also Read:క్రెడిట్ రిపోర్టులో తప్పులు..ఇలా చేస్తే?
ఇరాన్ విషయమై ఆయన మాట్లాడుతూ.. ఆ దేశ సైన్యాన్ని ఓడించాలనే తన పాత నినాదాన్ని పునరుద్ఘాటించారు. మేము ప్రాథమికంగా వారి సైన్యాన్ని ఓడించాము. నేను ఒప్పందాన్ని చేసుకోవడానికే మొగ్గు చూపుతాను…ఎందుకంటే సంతకం చేసిన వెంటనే మేము జలసంధిని తెరవవచ్చు…. నాకున్న ఒకే ఒక్క గ్యారెంటీ ఏంటంటే అక్కడ అణ్వాయుధాలు ఉండకూడదు. అందుకు వారు కూడా అంగీకరించారు అని ట్రంప్ తెలిపారు.
చర్చలు ముందుకు సాగకపోతే, అమెరికా ఇతర ప్రత్యామ్నాయాలకు వెనకాడబోదని ఆయన స్పష్టం చేశారు. నెమ్మదిగా అయినా ఖచ్చితంగా మేము అనుకున్నది సాధిస్తున్నాము—ఒకవేళ మాకు కావలసింది లభించకపోతే, మేము దీనిని వేరే మార్గంలో ముగిస్తాము అని ట్రంప్ హెచ్చరించారు.

