వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించారు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. నిజంగా ఎంతో ప్రత్యేకమైన ఆటగాడు అని అభివర్ణించిన సచిన్…ఈ యువ బ్యాటర్‌పై అనవసరమైన ఒత్తిడిని పెంచవద్దని…అతని ఆటను అతను ఆస్వాదించేలా స్వేచ్ఛను ఇవ్వాలని అభిమానులకు, నిపుణులకు విజ్ఞప్తి చేశారు.
కేవలం 14 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసి…ఆపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ద్వారా భారీ ధర దక్కించుకుని చరిత్ర సృష్టించాడు. అతని అసాధారణమైన బ్యాటింగ్ శైలి, షాట్లు ఆడే విధానం క్రికెట్ ప్రపంచాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. నేను వైభవ్ బ్యాటింగ్ చూశాను. ఆ వయసులో అతను బంతిని టైం చేస్తున్న విధానం, అతనికున్న షాట్ల శ్రేణి చూస్తే అతను నిజంగా ఎంతో ప్రత్యేకమైన ప్రతిభావంతుడని అర్థమవుతోంది. చాలా తక్కువ మందిలోనే ఇటువంటి సహజసిద్ధమైన ప్రతిభ కనిపిస్తుంది అని కొనియాడారు.
అయితే ఇంత చిన్న వయసులోనే విపరీతమైన పాపులారిటీ మరియు అంచనాలు రావడం వల్ల ఆటగాడిపై ఒత్తిడి పెరుగుతుందని సచిన్ ఆందోళన వ్యక్తం చేశారు. మనం అతని విషయంలో కొంచెం ఓపికగా ఉండాలి… ప్రతీ మ్యాచ్‌లోనే అతను అద్భుతాలు చేయాలని ఆశించకూడదు. అతను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. మీడియా అభిమానులు అతనిపై అంచనాల భారాన్ని మోపకుండా తన సహజసిద్ధమైన ఆటను ఆడుకోవడానికి అవసరమైన స్వేచ్ఛను ఇవ్వాలి అని సచిన్ సూచించారు.
Also Read:క్రెడిట్ రిపోర్టులో తప్పులు..ఇలా చేస్తే?
సూర్యవంశీ ప్రతిభను సరైన రీతిలో పెంపొందిస్తే…అతను భవిష్యత్తులో భారత క్రికెట్‌కు ఒక గొప్ప ఆస్తిగా మారుతాడని కానీ ప్రస్తుతానికి అతనికి తగినంత సమయం ఇవ్వడం ఎంతో ముఖ్యమని టెండూల్కర్ నొక్కి చెప్పారు.

