క్రెడిట్ రిపోర్టులో తప్పులు..ఇలా చేస్తే?

4
- Advertisement -

కొత్తగా హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ క్రెడిట్ ప్రొఫైల్ చాలా క్లీన్‌గా ఉండాలి. గతంలో తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించిన రికార్డు ఉంటేనే బ్యాంకులు కొత్త రుణాలను సులభంగా మంజూరు చేస్తాయి. అప్పు ఇచ్చే ముందు బ్యాంకులు లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తాయి. మీ క్రెడిట్ రిపోర్టులో దొర్లే చిన్న చిన్న పొరపాట్లు మీ స్కోరును దారుణంగా పడేస్తాయి. సకాలంలో స్పందించి ఆ తప్పులను సరిచేసుకోవడం ద్వారా మీ క్రెడిట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

క్రెడిట్ రిపోర్ట్ అనేది ఒక వ్యక్తి యొక్క ఆర్థిక రిపోర్ట్ కార్డ్ లాంటిది. ఇందులో మీ పాత లోన్లు, క్రెడిట్ కార్డుల వాడకం, చెల్లింపుల చరిత్ర, అవుట్‌స్టాండింగ్ బ్యాలెన్స్ వంటి పూర్తి వివరాలు ఉంటాయి. బ్యాంకులు ఈ నివేదిక ఆధారంగానే మీ క్రెడిట్ అర్హతను అంచనా వేస్తాయి. తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ లోన్ అప్లికేషన్లు పెట్టడం వల్ల మీ ప్రొఫైల్‌పై ‘హార్డ్ ఎంక్వైరీలు’ పెరుగుతాయి. ఇది మిమ్మల్ని అప్పుల కోసం వెంపర్లాడే వ్యక్తిగా చూపిస్తుంది.

()బ్యాంకులు లోన్ అప్‌డేట్లను క్రెడిట్ బ్యూరోలకు పంపడంలో ఆలస్యం చేయడం వల్ల తప్పులు దొర్లవచ్చు. కంప్యూటర్ లేదా మాన్యువల్ డేటా ఎంట్రీ లోపాలు ఇందుకు కారణం కావచ్చు. మీ పేరు, స్పెల్లింగ్స్ తప్పుగా పడటం లేదా వేరొకరి డేటా మీ ఖాతాకు లింక్ కావడం వల్ల సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు క్లోజ్ చేసిన లోన్లు ఇంకా యాక్టివ్‌గా చూపిస్తుంటాయి. ఈ పొరపాట్లను క్రెడిట్ బ్యూరోల ద్వారా సరిచేసుకోవచ్చు.

()ముందుగా మీ క్రెడిట్ రిపోర్ట్ తాజా కాపీని తీసుకోండి. అందులోని ప్రతి విభాగాన్ని నిశితంగా తనిఖీ చేయండి. తప్పుగా ఉన్న సమాచారాన్ని ఒకచోట నోట్ చేసుకోండి.
()మీ వ్యక్తిగత వివరాల తప్పులు, మీవి కాని లోన్ అకౌంట్లు, చెల్లించినా చెల్లించనట్లు చూపిస్తున్న పేమెంట్ స్టేటస్ వంటి వాటిని స్పష్టంగా మార్క్ చేయండి.
()మీ వాదనను బలంగా నిరూపించడానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి. బ్యాంక్ స్టేట్‌మెంట్లు, లోన్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కాపీలు, గుర్తింపు కార్డులను సేకరించండి.

Also Read:వెనక్కి తగ్గిన ‘పెద్ది’ నిర్మాతలు!

()భారతదేశంలో సిబిల్ (CIBIL), ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, సిరిఫ్ హైమార్క్ అనే నాలుగు ప్రధాన క్రెడిట్ బ్యూరోలు ఉన్నాయి. సంబంధిత బ్యూరో అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయండి. మీ వద్ద ఉన్న ఆధారాలను అక్కడ సబ్మిట్ చేయండి.
()ఫిర్యాదు చేసిన తర్వాత వారు ఇచ్చే రిఫరెన్స్ నంబర్ సహాయంతో మీ అప్లికేషన్ స్టేటస్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి. తప్పులు సరిదిద్దబడిన తర్వాత కొత్త క్రెడిట్ రిపోర్టును తనిఖీ చేసి ధృవీకరించుకోండి. మంచి క్రెడిట్ స్కోరు ఉంటే భవిష్యత్తులో తక్కువ వడ్డీ రేట్లకే లోన్లు లభిస్తాయి.

- Advertisement -