IPL:సెలబ్రేషన్స్‌కు అనుమతిలేదు!

5
- Advertisement -

గతేడాది (జూన్ 2025లో) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో ఆర్‌సిబి (RCB) విజయోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించి..33 మంది గాయపడిన విషాద ఘటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తమ రెండవ ఐపీఎల్ టైటిల్‌ను గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న తరుణంలో, ఆదివారం సాయంత్రం జరగబోయే ఫైనల్ మ్యాచ్‌ను పురస్కరించుకుని బెంగళూరు పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ ముగిసిన తర్వాత బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం, రోడ్లపై వేడుకలు జరపడం, అల్లర్లు సృష్టించడం లేదా గొడవలకు దిగడం వంటి పనులు చేయవద్దని ప్రజలను కోరారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు ఆదివారం (మే 31) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి.

నగరంలో ఎక్కడా బహిరంగ వేడుకలు గానీ, బైక్ ర్యాలీలు గానీ నిర్వహించడానికి అనుమతి లేదని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.గత ఏడాది విజయోత్సవాల సమయంలో జరిగిన ఘోర ప్రమాదాలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ హెచ్చరికలు జారీ చేశారు. జూన్ 4, 2025న చిన్నస్వామి స్టేడియం వెలుపల ఆర్‌సిబి టైటిల్ గెలిచిన ఆనందంలో అభిమానులు జరిపిన వేడుకల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ బహిరంగ ప్రదేశాల్లోని ఎల్‌ఈడీ (LED) స్క్రీన్‌లపై మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై పూర్తి నిషేధం విధించారు. మాల్స్, పబ్‌లు మరియు ఇతర సంస్థల వెలుపల సాధారణ ప్రజలకు కనిపించేలా ఏర్పాటు చేసే స్క్రీన్‌లకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి. అధికారుల ముందస్తు అనుమతి లేకుండా రోడ్ల వైపు చూసేలా ఎల్‌ఈడీ వాల్స్‌ను ఏర్పాటు చేయడానికి వీల్లేదు.సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి లేకుండా రోడ్ల వైపు చూసేలా ఎల్‌ఈడీ వాల్స్‌ను ఏర్పాటు చేయకూడదు, ఒకవేళ ఇప్పటికే ఉన్న ఎల్‌ఈడీ వాల్స్ ఉంటే వాటిపై మ్యాచ్‌ను ప్రసారం చేయకూడదు. మాల్స్, పబ్‌లు లేదా ఇతర సంస్థల వెలుపల ప్రజలకు కనిపించేలా స్క్రీన్‌లను ఏర్పాటు చేయరాదు అని అడ్వైజరీలో పేర్కొన్నారు.

బైక్ ర్యాలీలు, మితిమీరిన వేగం, స్టంట్ రైడింగ్, అనవసరంగా హారన్ కొట్టడం, రోడ్ల దిగ్బంధనం, బాణసంచా కాల్చడం మరియు ప్రమాదకరమైన వస్తువులను ఉపయోగించడాన్ని కూడా ఈ మార్గదర్శకాల్లో నిషేధించారు. మ్యాచ్ ఫలితం తర్వాత రోడ్లపై బహిరంగ వేడుకలు జరుపుకోవడాన్ని బ్యాన్ చేశారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో శాంతి, క్రమశిక్షణను కాపాడాలి అని పోలీసులు తెలిపారు.

Also Read:క్రెడిట్ రిపోర్టులో తప్పులు..ఇలా చేస్తే?

వేడుకల సమయంలో బహిరంగంగా మద్యం సేవించడం, అసభ్యంగా ప్రవర్తించడం మరియు ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడటం వంటి వాటిపై అధికారులు హెచ్చరించారు.సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, ద్వేషపూరిత సందేశాలు లేదా పుకార్లను షేర్ చేయవద్దని కూడా పోలీసులు ప్రజలను హెచ్చరించారు. మ్యాచ్ ఫలితాన్ని సాకుగా తీసుకుని ఇతర జట్ల అభిమానులను రెచ్చగొట్టడం, అవమానించడం లేదా గొడవలకు దారితీసేలా ప్రవర్తించకూడదు అని స్పష్టం చేశారు.ప్రజలంతా బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని, శాంతిభద్రతలను కాపాడటం మరియు ప్రజా రక్షణ అనేది అందరి ఉమ్మడి బాధ్యత అని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -