హెచ్‌ 1బీ వీసాలు…ట్రంప్ కీలకనిర్ణయం!

198
trump
- Advertisement -

హెచ్‌ 1బీ వీసాల రద్దుపై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తొలుత రెండు నెలల వరకు హెచ్‌1 బీ వీసాలపై బ్యాన్ విధించిన ట్రంప్ దానిని పొడగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఆర్ధిక సంవత్సరం అక్టోబర్ 1 వరకు హెచ్‌ 1బీ వీసాలపై రద్దును పొడగించనున్నట్లు సమాచారం.

కరోనా వైరస్, అమెరికాలో స్ధానికులు ఉద్యోగాలు కొల్పోయిన నేపథ్యంలో హెచ్‌ 1 బీ వీసాల రద్దు గడువును పొడగించాలని ట్రంప్ భావిస్తున్నారని అక్కడి మీడియా కథనాలను రాసింది. దీంతో మెరికాలో హెచ్ 1 బీ వీసా హోల్డర్స్ కు కష్టాలు తప్పేలా లేవు.

సాధారణంగా హెచ్ 1 బీ వీసాలు టెక్నాలజీ రంగంలో పనిచేసే వారికే ఎక్కువగా ఇస్తారు. ఇలా హెచ్ 1 బీ వీసా ద్వారా అమెరికా వెళ్లే వారిలో ఇండియన్సే 70 శాతం ఉంటారు. కరోనా ఎఫెక్ట్ తో ఇప్పుడు చాలా మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారు. జూన్‌తో వీసాల రెన్యువల్ గడువు ముగియనుంది. వీసాల రెన్యువల్ అయితఏ గానీ కొత్త ఉద్యోగం గానీ దొరికే పరిస్థితి లేదు. దీంతో హెచ్ 1 బీ వీసా తో అమెరికాలో ఉన్న ఇండియన్స్ లో ఆందోళన మొదలైంది.

అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని, వివిధ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నమని వైట్ హస్ ప్రతినిధులు తెలిపారు. మరోవైపు భారత ప్రభుత్వం కూడా అమెరికాలో పనిచేస్తున్న ఇండియన్స్‌ వీసాల గడువు పొడగించాలని అమెరికాను కోరింది. మరి దీనిపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.

- Advertisement -