డిసెంబర్ తర్వాతే సర్కార్‌వారి పాట..!

634
mahesh babu
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా గీతాగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. కృష్ణ బర్త్ డే సందర్భంగా టైటిల్‌ లుక్‌ని రివీల్ చేయగా ప్రేక్షకుల నుండి మంచిస్పందన వచ్చింది. బ్యాంకు మోసాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివెంజ్‌ డ్రామాగా మూవీ తెరకెక్కుతుండగా ఓ బ్యాంకు మేనేజర్‌ కొడుకుగా మహేశ్‌ కనిపించనున్నట్లు టాక్.

షూటింగ్ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో సాంగ్స్‌ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారట మహేశ్-దర్శకుడు పరశురామ్. అయితే తాజాగా సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది.

తొలుత దసరాకు సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించిన ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ తర్వాతే సర్కార్ వారి పాటను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్నాయి.

- Advertisement -