తెలుగు రాష్ట్రాల్లో ఆగిన చక్రాలు..

235
Truckers strike in Telugu states
Truckers strike in Telugu states
- Advertisement -

భారీగా పెంచిన బీమా ప్రీమియాన్ని తగ్గించడంతోపాటు తదితర 13 సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా లారీ యాజమాన్యాల సంఘాలు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది. ఈ సమ్మెతో దేశవ్యాప్తంగా 70% ట్రక్కులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 4 లక్షలకు పైగా లారీలు పార్కింగ్‌కే పరిమితమయ్యాయి. దీంతో ఆయా సరుకుల రవాణా ఎక్కడికక్కడే నిలిచిపోయింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లారీ యాజమాన్య సంఘాలు.. సింగిల్‌ పర్మిట్‌ విధానం తీసుకురావాలని, లోడింగ్‌- అన్‌లోడింగ్‌ ప్రక్రియలో భాగమైన మామూళ్లను తగ్గించాలనే ప్రధాన డిమాండ్‌తో సమ్మెలో పాల్గొంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పన్ను మొత్తాన్నే.. రాష్ర్టాల పరిధి తగ్గిపోయినప్పటికీ ఇటు తెలంగాణలోనూ, అటు ఏపీలోనూ కొనసాగిస్తుండటంతో లారీ యజమానులపై భారం పడుతోందని తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షప్రధాన్య కార్యదర్శులు ఎన్‌.భాస్కర్‌రెడ్డి, జి.దుర్గాప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించేవరకూ లారీలను రోడ్డెంకించబోమని తేల్చిచెప్పారు. ఈ సమ్మె శుక్రవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. కాగా… సమ్మెలో భాగంగా వంటావార్పు, నిరసనలు నిర్వహించేందుకు లారీ యజమానుల సంఘం పేర్కొంది. అలాగే పాలు, కూరగాయలు, పెట్రోల్‌ వంటి అత్యవసర సేవలకు ఆదివారం వరకు లారీ యజమానుల సంఘం గడువు విధించింది. ఈ సమ్మెతో తెలంగాణలో 2.5 లక్షల లారీలు నిలిచిపోయాయి.

నిత్యావసర సరుకుల రవాణాకు ఆటంకం కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను, అధికారులను సీఎస్‌ ఎస్పీ సింగ్‌ ఆదేశించారు. పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు తగినంతగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాలు, కూరలు తదితర నిత్యావసర సరుకులను రవాణా చేసే వాహనాలకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సరుకు రవాణాకు అవసరమైతే ఆర్టీసీ బస్సులను ఉపయోగించాలని ఆదేశించారు. కా గా, దక్షిణాదిలోనూ సమ్మె విజయవంతమైందని ట్రక్కు యజమానుల జేఏసీ ప్రకటించింది.

- Advertisement -