అటు తేజూ ఇటు అఖిల్ మధ్యలో సమంత..

192
akhil teju samantha
akhil teju samantha

ఈ సీన్ సినీ ఫ్యాన్స్‌కి కనుల పండుగగా ఉంది. తాజాగా జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి పాటల మెడ్లేకు అక్కినేని అఖిల్‌ డ్యాన్సులు వేశాడు. అనంతరం నాగార్జున పాటలకు సాయిధరమ్‌ డ్యాన్సులు ఇరగదీశాడు. వారితో కలిసి సమంత తనదైన స్టైల్ లో డ్యాన్స్ చేసి అలరించింది.

అఖిల్‌ ‘మ..మ..మాస్‌’ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశాడు. సాయిధరమ్‌తేజ్‌ ‘బంగారు కోడి పెట్ట’ అంటూ రెచ్చిపోయాడు. వీరిద్దరూ కలసి ‘అమ్మడూ.. లెట్స్‌ డూ కుమ్ముడూ’ అంటూ ‘ఖైదీ నెం 150’లోని చిరు పాటకు చిందులు వేయడం ఆకట్టుకొంది. తేజూ నాగార్జున పాట ‘కన్నెపెట్టరో కన్నుకొట్టరో’ పాటకు స్టెప్పులు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

akhil-teju

ఆ తర్వాత తేజు, సమంత, అఖిల్ లు కలిసి మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150 మూవీలోని అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు సాంగ్ కి డ్యాన్స్ వేసినట్టు తెలుస్తుంది. ఇరు కుటుంబాలకు చెందిన హీరోలు వేసిన స్టెప్పులు ఒకటైతే వారితో కలిసి సమంత చేసిన డ్యాన్స్ ప్రోగ్రాంకే హైలైట్ అని అంటున్నారు. ప్రస్తుతం వీరి డ్యాన్స్ కి చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులు ఈ పిక్స్ ని చూసి తెగ మురిసిపోతున్నారు. అక్షరహాస‌న్‌, రాశీ ఖన్నా వేదికపై సందడి చేశారు. తెలుగు, తమిళ, హిందీ పాటలకు అక్షర వేసిన స్టెప్పులు అలరించాయి.

rashi khanna