గంగ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న కేటీఆర్

353
KTR-Attend-to-Gangamma
- Advertisement -

సిరిసిల్ల జిల్లాలోని మానేరు న‌ది ఒడ్డున గంగ‌మ్మ త‌ల్లి క‌ళ్యాణోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా గంగ‌మ్మ త‌ల్లికి ఆయ‌న ప్ర‌త్యేక పూజలు చేశారు. అనంతరం మండలేశ్వర స్వామిని దర్శించుకున్నారు కెటిఆర్‌కు అర్చకులు, ఆలయన కమిటి సభ్యులు ఘన స్వాగతం పలికారు.

గంగమ్మ తల్లి కుంకుమ పూజకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్ర‌తి ఏడాది మాఘమాసంలో గంగ‌మ్మ త‌ల్లి జాత‌ర‌ను నిర్వహిస్తారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం విస్త్రత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని గంగమ్మ తల్లిని కోరుకున్నట్టు కెటిఆర్ తెలిపారు.

- Advertisement -