డైరెక్టర్ శేఖర్ కమ్ముల బర్త్ డే సెలబ్రేషన్స్..

305
- Advertisement -

అటు యువతను, ఇటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కథా బలమున్న చిత్రాలను తీసే దర్శకుడు ఎవరంటే ‘శేఖర్ కమ్ముల’ అని చెప్పవచ్చు. ఈ సెన్సిబుల్ డైరెక్టర్ గతేడాది “ఫిదా” మూవీతో సంచలనం సృష్టించారు. అయితే “ఫిదా” తర్వాత దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని ఇన్నాళ్లకు కొత్త సినిమా మొదలుపెట్టాడు.

Director Sekhar Kammula

నేడు శేఖర్ కమ్ముల పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ సమక్షంలో ఆయన పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఎమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో ఏషియన్ గ్రూప్ నిర్మిస్తున్న ఈ మూవీ లొకేషన్‌లో నిర్మాతలు..శేఖర్ కమ్ములతో కేక్ కట్ చేయించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Director Sekhar Kammula

ఇక ఈ వేడుకలో నిర్మాతలు సునీల్ నారంగ్, పి. రామ్మోహన్ రావులతో పాటు ఏషియన్ గ్రూప్ పార్టనర్ సదానంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, ఎగ్జిబిటర్ శ్రీధర్, సినిమాటోగ్రాఫర్ విజయ్.సి.కుమార్, మూవీ టీమ్ పాల్గొన్నారు. అంతా కొత్తవారితో నిర్మిస్తున్న ఈ మ్యూజికల్ లవ్ స్టొరీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది.

- Advertisement -