ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ను అభినందించిన కేటీఆర్..

271
KTR-and-Boora
- Advertisement -

భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ను అభినందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. నిన్న ఉదయం రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళకు తన వృత్తి ధర్మాన్ని పాటించి ప్రథమ చికిత్స చేసారు ఎంపీ బూర నర్సయ్య గౌడ్. ఈవిషయంపై సోషల్ మీడియాలో ఎంపికి పలువురు ప్రశంసలు కురిపించారు. ప్రజాప్రతినిధి అంటే నిలా ఉండాలి అంటూ ట్వీట్ చేస్తున్నారు. తాజాగా ఈఫోటో చూసి కేటీఆర్ తన ట్వీట్టర్ ద్వారా స్పందించారు. గొప్ప స్పందన నర్సయ్య సాబ్ అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.కెటిఆర్ ట్విట్ చేయడంతో వందలాధి మంది స్పందిస్తూ నర్సయ్యగౌడ్‌కు అభినందనలు తెలిపారు.

నల్గొండ జిల్లాలో ఉంటున్న పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెంకు చెందిన నాగరాజు, వెంకటేశ్వర్లు, నాగమణి బైక్ పై నాగమణి తండ్రి అంతక్రియలకు సొంత ఊరుకు వెళ్తున్నారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామం వద్ద బైక్ అదుపుతప్పి ముందు వెళ్తున్న వాహనాన్ని ఢికొట్టింది. నాగమణి చీర బైక్ చక్రంలో చిక్కుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది నాగమణి. అదే సమయంలో హైదరాబాద్ నుంచి సూర్యపేట వెళ్తున్న ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కారు ఆపీ ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఆంబులెన్స్ ను పిలిపించి స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -